పసుపుకు మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలని తెలంగాణ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. ఇది పంట చేతికొచ్చే సమయం అని, త్వరితగతిన రైతులను ఆదుకోవాల్సిన తరుణం అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర ఇచ్చి ఆదుకునే వ్యవస్థ ఇంతకుముందు నుంచే ఉందని చెప్పారు. అప్పట్లో చంద్రబాబు ఇచ్చారని, ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ కూడా ఇస్తున్నారని తెలిపారు.
జగన్, గతంలో చంద్రబాబు ఇచ్చిన తరహాలో తెలంగాణలోనూ పసుపు రైతులకు మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలని కోరారు. గతంలో లేఖలను మనిషితో మీ వద్దకు పంపిస్తే లోనికి అనుమతించడంలేదని, అందుకే ఈ లేఖను కొరియర్ లో పంపుతున్నానని అరవింద్ వివరణ ఇచ్చారు.
ప్రజావేదికను కూల్చివేయాలి.. అధికారులకు జగన్ ఆదేశాలు