బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల వీరిద్దరి సినిమాలు ఒకేసారి విడుదలకు సిద్ధమవుతుండడంతో ఆ వివాదం మళ్ళీ రాజుకుంది. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా హృతిక్ పై కంగనా సోదరి రంగోలి చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మళ్ళీ వార్తల్లో నిలిచింది. గతంలో కొంతకాలం పాటు సహజీవనం చేసిన ఈ ఇద్దరూ ఆ తర్వాత విడిపోయి శత్రువులుగా మారిపోయారు. ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. కంగన, ఆమె సోదరి రంగోలీ హృతిక్‌పై అవకాశం వచ్చినప్పుడల్లా తీవ్ర విమర్శలు చేస్తుంటారు. హృతిక్ మాత్రం ఇప్పటివరకు కంగన గురించి బహిరంగంగా విమర్శలు చేయలేదు. ఇటీవల హృతిక్ “సూపర్30”, కంగన “జడ్జిమెంటల్ హై క్యా” సినిమాల విడుదల విషయంలో వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. దీంతో హృతిక్ వెనక్కి తగ్గి తన సినిమా విడుదలను వాయిదా వేసుకున్నాడు. తాజాగా కంగనతో వివాదాల గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. “అవతలివారు గొడవకు దిగినా నేను వివాదాలకు దూరంగా ఉండేందుకే ప్రయత్నిస్తున్నా. గొడవకు దిగడాన్ని ఎంజాయ్ చేసేవారికి నేను ఇకపై అవకాశం ఇవ్వదలచుకోలేదు. ఆరేళ్లుగా ఈ సర్కస్‌ని కొనసాగిస్తూనే ఉన్నారు. చట్టబద్ధమైన పోరాటానికి నేను నేరుగా దిగలేదు. భారత్‌లో ఓ యువకుడు మహిళలకు వ్యతిరేకరంగా చట్టబద్ధంగా పోరాడడం అనే దానికి ముగింపు ఉండదు. అది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది” అని హృతిక్ అన్నాడు.
previous post
దిశ మర్డర్… వాళ్ళు నిందితులు కాదు : పోసాని సంచలన వ్యాఖ్యలు