telugu navyamedia
సినిమా వార్తలు

‘ఆర్ ఆర్ ఆర్’ నుంచి ‘జనని’ సాంగ్ రిలీజ్‌ ..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్​ఆర్​ఆర్ ​​. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన‌ ఈ సినిమాలో అలియా భట్, అజయ్ దేవగన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక ఇటీవల విడుదలైన నాటు నాటు వీర నాటు సాంగ్ నెట్టింట్లో ట్రెండ్ అవుతుంది.

SS Rajamouli Takes a Risky Date For RRR Movie Release?

తాజాగా ఈ సినిమా నుంచి ‘జనని’ పాట విడుదలైంది. మంచి బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​తో పాట ఆద్యంతం ఆకట్టుకుంటోంది. తెలుగు సహా కన్నడ, మలయాళం, తమిళ్, హిందీల్లో విడుదలైన ఈ పాట భావోద్వేగానికి గురిచేస్తోంది.

దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని వచ్చే యేడాది జనవరి 7వ తేదీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయ‌బోతున్నారు.

Related posts