telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ ఆత్మహత్యపై సల్మాన్ సంచలన ట్వీట్

Salman-KHan

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్‌ లో సంచలనం సృష్టించింది. గత ఆరు నెలలుగా సుశాంత్ డిప్రెషన్‌లో ఉన్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలడంతో ఇండస్ట్రీలో నెపోటిజం (బంధు ప్రీతి) అంశాన్ని లేవనెత్తుతూ ఇండ‌స్ట్రీలో ఉన్న కొంద‌రు పరిశ్ర‌మ పెద్ద‌ల‌ే ఇలాంటి దుర్ఘటనలకు కారణమంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ మేరకు కొందరు సెలెబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలను అన్‌ఫాలో చేస్తూ వ్యతిరేకతను చాటుతున్నారు నెటిజన్లు. ఇంకొందరు చిన్న నటీనటులు తాము కూడా బెదిరింపులు, ఒత్తిళ్లు ఎదుర్కొన్నామ‌ని బాహాటంగానే చెప్పేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ మాఫియా వ‌ల్ల‌నే సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడంటూ పాట్నాకు చెందిన జన్ అధికార్ స్టూడెంట్ యూనియ‌న్ రోడ్లపైకి వచ్చి నిరసనలు చేశారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, నిర్మాత కరణ్ జోహార్ దిష్టిబొమ్మలను తగలబెట్టారు. దీంతో సల్మాన్ అభిమానులు కోపంతో రగిలిపోయారు. ఈ పరిస్థితుల్లో సుశాంత్ ఆత్మహత్యపై సల్మాన్ ఖాన్ స్పందిస్తూ త‌న ఫ్యాన్స్ అంతా సుశాంత్ అభిమానుల‌కు అండ‌గా నిల‌బ‌డాల‌ని సల్మాన్ కోరడం సంచలన అంశంగా మారింది. సంద‌ర్భం వెనుక ఉన్న భావోద్వేగాన్ని అర్థం చేసుకోవాలే తప్ప ఒకరినొకరు దూషించుకోవడం సరైనది కాదని ఆయన పేర్కొన్నారు. ఇక సుశాంత్ కుటుంబ స‌భ్యులకు, అభిమానుల‌కు అండంగా ఉండ‌మ‌ని త‌న ఫ్యాన్స్‌కి సల్మాన్ సూచనలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

Related posts