telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆరోపణలు చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను కథలు వినిపించుకుంటూ పోవాలా..?… కొరటాల ఫైర్

koratala

మెగాస్టార్ చిరంజీవి హీరోగా “ఆచార్య” చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ చిత్రాన్ని సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై రామ్ చరణ్, నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పుట్టినరోజు కానుకగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రం నుంచి మోషన్ పోస్టర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కినట్లుగా ఈ మోషన్ పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సమ్మర్ 2021కి విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ మోషన్ పోస్టర్‌లో ప్రకటించింది. ఇది చిరంజీవికి 152 వ సినిమా. ఇప్పుడు ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. అయితే ఈ సినిమా స్టోరీ తనదే అని రాజేష్ అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయం పై కొరటాల శివ క్లారిటీ ఇచ్చారు. ఇది ఎవరి స్టోరీ కాదని ఇది తన సొంతంగా రాసుకున్న కథ అంటూ శివ తెలిపారు. ఇదే విషయం పై ఎన్టీవీలో జరిగిన డిబేట్ లో కొరటాల శివకు రాజేష్ అనే వ్యక్తికి మధ్య వాగ్వాదం జరిగింది. దేవాలయాల భూములపై నేను రాసుకున్న కథను కొరటాల తీస్తున్నారని రాజేష్ వ్యక్తి ఆరోపిస్తున్నారు. ‘అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి మొదటిగా నా కథను వినిపించా.. నేను చూసిన నిజ జీవిత కథల ఆధారంగా స్టోరీ రాసుకున్నా.. ఆ కథను మైత్రి మూవీస్ కు వినిపించాను. నా పై అంత బడ్జెట్ పెట్టలేక ఆ కథను కొరటాల కు ఇచ్చి చేయిస్తున్నారు” అంటూ రాజేష్ ఆరోపిస్తున్నాడు. ఒక వేళ ఇది నా కథకాకపోతే నేను క్షమాపణ చెప్తా.. అని రాజేష్ అన్నాడు.


కొరటాల వివరణ ఇస్తూ ‘మీరు రాసుకున్న కథ వేరు.. నా కథ వేరు. సోషల్ ఇష్యుస్ పై ఎవరికీ తోచిన విధంగా వారు కథలు రాసుకుంటూ ఉంటారు. ఇది రాజేష్ రాసుకున్న కథ కాదు. ఇది నేను రాసుకున్న కథ. షూటింగ్ దశలో ఉన్న సినిమా స్టోరీ నేను ఎలా చెప్పగలను. ఆరోపణలు చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను కథలు వినిపించుకుంటూ పోవాలా..? అని శివ అన్నారు. ‘కో డైరెక్టర్ ద్వారా కథ తెలుసుకొని నేను మాట్లాడుతున్నా… ఇది ఖచ్చితంగా నా కథే’ అని అన్నారు రాజేష్. దాంతో కొరటాల శివ మండిపడ్డారు. ‘నా కోసం పనిచేసే నా మనుషులు కథను ఎలా బయటకు చెప్తారు. ఇది మొత్తం అసత్యారోపణలు అని అన్నారు. ఆచార్య సినిమా కథ అతను చెప్పే కథ ఒకటి కాదు అని ఎన్నిసార్లు చెప్పినా అతను వినడంలేదు. దాంతో కొరటాల ఈ విషయంపై కోర్టుకు వెళ్తా అని అన్నారు. తన సినిమా పై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని కొరటాల అన్నారు. అంతే కాకుండా చిరంజీవి దృష్టికి కూడా ఇది తీసుకువెళ్తానని అన్నారు.

Related posts