telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్టార్ హీరోతో ప్రేమలో హీరోయిన్…!

Nidhi-Agarwal

“సవ్యసాచి” టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఇస్మార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్ రెండవ సినిమాగా అఖిల్ సరసన ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో అఖిల్ సరసన నటించింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి. ఆ తరువాత డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ రూపొందించిన “ఇస్మార్ట్ శంకర్” సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది నిధి. తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా గ్లామరస్ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకుంది. ఇక లాక్ డౌన్ సమయంలో తన హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇటీవలే ఫేస్ బుక్ లో 8.5 మిలియన్ ఫాలోవర్స్ కి రీచ్ అయిన నిధి అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది.ఈ చిట్ చాట్ లో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో రణబీర్ కపూర్ తో లవ్ లో పడిపోయానని, ఒక్కసారైనా రణ్ బీర్ తో కలిసి నటించాలన్నది తన డ్రీమ్ అని చెప్పుకొచ్చింది. ఇక ముందుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నిధి ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

Related posts