telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

శ్రీవారి అర్చకులపై ఏపీ ప్రభుత్వం వరాలు

jagan tirumala

శ్రీవారి ఆలయ అర్చకులపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మీరాశి వంశికులు ఇష్టం మేరకు సంభావన అర్చకులు గాను…. లేదా పే స్కేల్ విధానంలో కొనసాగే వెసలుబాటు కల్పిస్తూ జిఓ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. పే స్కేల్ విధానంలో కొనసాగే మీరాశి అర్చకులు 65 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఉండనుండగా… అటు తరువాత వారి వంశం నుంచి మరొకరికి అవకాశం కల్పించేలా నిర్ణయం తీసుకుంది. సంభావన క్రింద కొనసాగే అర్చకులు ఆరోగ్యంగా వున్నంత వరకు కొనసాగి…అటు తరువాత వారి వంశంలో వారికి అవకాశం కల్పించే వెసులుబాటు కల్పించింది. పే-స్కేల్ విధానంలో కొనసాగే వారు… ఎప్పుడైనా సంభావన విధానంలోకి మారే అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం. మీరాశి వంశికులలో మేజారిటీ అర్చకులు పే-స్కేల్ విధానం వైపు మొగ్గు చూపడంతో సర్వీసు రిజిష్టర్ ఒపెన్ చేసింది టిటిడి. మీరాశి వంశికులు విజ్ఞప్తి మేరకు వారి తనయులు పది మందికి అర్చకవారసత్వం కల్పించింది టిటిడి. తిరుపుతమ్మ వంశం నుంచి 6 మందికి…. గొల్లపల్లి వంశం నుంచి నలుగురికి శ్రీవారి ఆలయ అర్చకులుగా అవకాశం కల్పించింది. రమణ దీక్షితులుతో సహ మరో ముగ్గురు మాత్రమే సంభావన అర్చకులుగా కొనసాగే అవకాశం ఉంది.

Related posts