telugu navyamedia
సినిమా వార్తలు

విశ్వ‌క్‌సేన్‌పై మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ కు ఓ రిపోర్ట‌ర్ ఫిర్యాదు..

*విశ్వ‌క్‌సేన్‌పై మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ కు ఓ రిపోర్ట‌ర్ ఫిర్యాదు..
*డిబేట్‌లో విశ్వ‌క్‌సేన్ ఎఫ్.. బాష వాడ‌డంపైతీవ్ర విమ‌ర్శ‌లు..

*ప్ర‌భుత్వ ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్న మంత్రి హామీ..

యంగ్‌ హీరో విశ్వక్‌సేన్ అభ్యంత‌ర‌క‌ర ప‌దం వాడి వివాదంలో చిక్కుకున్నాడు. విశ్వక్‌సేన్ న‌టించిన‌‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమా ఈ నెల 6వ తేదీన విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విశ్వక్‌ సేన్‌, ఆయన టీం చేసిన ప్రాంక్‌ వీడియో వదిలాడు. అయితే కాస్త‌ అది పెద్ద వివాదమై కూర్చొంది.

రోడ్డుపై ఆ న్యూసెన్స్ ఏమిటని కొందరు, ఆత్మహత్యలను ప్రోత్సాహిస్తున్నావా? అని మరికొందరు విశ్వక్ సేన్‌ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీనిపై అరుణ్ కుమార్ అనే అడ్వకేట్.. విశ్వక్ సేన్ మీద హెచ్ఆర్‌సిలో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

Argument between hero Vishwak Sen and anchor Devi Nagavalli in live debate  over prank video

ఇదే అంశంపై ఓ టీవీ ఛానెల్‌లో జరిగిన డిబెట్‌లో విశ్వక్​ సేన్​, సదరు యాంకర్‌కి మధ్య వాడివాడి చర్చ జరిగింది. స్టూడియో నుంచి ‘గెట్​ అవుట్’​ అంటూ యాంకర్ గట్టిగా అరవడం, దానికి విశ్వక్‌ సేన్‌ అభ్యంతరకర ఎఫ్‌.. పదాన్ని వాడటం నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది.

Complaint Against Vishwak Sen For Doing A Prank video - Movie News

తాజాగా ఇదే అంశంపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కి యాంకర్‌ దేవి నాగవల్లి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన మంత్రి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘విశ్వక్‌ సేన్‌ ప్రవర్తన బాగాలేదు. కశ్చితంగా చర్యలు ఉంటాయి.

రోడ్డుపై న్యూసెన్స్‌ చేస్తా.. ప్రశ్నిస్తే ఇష్టమొచ్చినట్లు మాట్లాడతానంటే ఎవరూ ఊరుకోరు. ఆయన సారీ చెప్పిన పద్దతి కూడా సరిగా లేదు.ఈ విషయాన్ని మా అసోసియేషన్‌ దృష్టికి కూడా తీసుకెళ్తాం’ అని పేర్కొన్నారు.

Related posts