telugu navyamedia
సినిమా వార్తలు

విరించి వర్మకు నందమూరి హీరో గ్రీన్ సిగ్నల్

Kalyan-Ram

ప్రస్తుతం కల్యాణ్ రామ్ తన తాజా చిత్రాన్ని వేణు మల్లిడి దర్శకత్వంలో చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకి “తుగ్లక్” అనే టైటిల్ ను ఖరారు చేశారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందని అంటున్నారు. ఇంతవరకూ చేయని వైవిధ్యభరితమైన పాత్రలో కల్యాణ్ రామ్ చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా తరువాత ఆయన విరించి వర్మ దర్శకత్వంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. “ఉయ్యాలా జంపాల” సినిమాతో తొలి హిట్ అందుకున్న విరించి వర్మ, ఆ తరువాత నాని హీరోగా “మజ్ను” చేసి మంచి మార్కులు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఆయన వినిపించిన పూర్తి స్క్రిప్ట్ పట్ల కల్యాణ్ రామ్ పూర్తి సంతృప్తి చెందినట్టుగా ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. జూలై నుంచి రెగ్యులర్ షూటింగు మొదలు పెట్టనున్నారట. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ కథ కోసం హీరోయిన్ల కోసం వెతుకుతున్నారట చిత్రబృందం.

Related posts