telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేంద్రానికి కేటీఆర్ మరో లేఖ

ఐటి పరిశ్రమలో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న హైదరాబాద్ నగరానికి ఐటిఐఆర్ తో సమానమైన ప్రత్యేక హోదా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు ఈరోజు కోరారు. తెలంగాణ ఐటి మరియు ఐటి అనుబంధ రంగాల్లో అద్భుతమైన ప్రగతిని హైదరాబాద్ గత ఆరు సంవత్సరాలుగా కొనసాగిస్తున్నదని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తన లేఖలో కేంద్రమంత్రికి వివరించారు. దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ ప్రగతి ప్రస్తుతం ఉన్న కొవిడ్ సంక్షోభంలో ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లోనూ తెలంగాణ ఐటీ ఎగుమతులు భారీ ఎత్తున పెరిగాయన్నారు. జాతీయ సగటు 1.9% ఉండగా తెలంగాణ గ్రోత్ రేట్ 7 శాతంతో 1.4 లక్షల కోట్లతో ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించారు. కోవిడ్ పరిస్థితులున్న సంవత్సరంలోనూ 8.7 మిలియన్ స్క్వేర్ ఫీట్ ల నూతన కార్యాలయం స్పేస్ క్రియేషన్ హైదరాబాద్లో జరిగిన విషయాన్ని కూడా తెలిపారు. ఈ రంగంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్, గోల్డ్ మాన్ సాక్స్, ఫియట్ క్రిస్లార్ ఆటో మొబైల్స్ వంటి అనేక ప్రముఖ కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన విషయాన్ని కేంద్ర మంత్రికి తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్తి ఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా అనలిటిక్స్, ఐఓటి, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఎంటర్టైన్మెంట్ టెక్నాలజీస్, బ్లాక్చైన్ వంటి నూతన ఎమర్జింగ్ టెక్నాలజీలను సైతం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ వస్తున్నది. దీంతోపాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, నైపుణ్య శిక్షణ వంటి రంగాల్లో కూడా ప్రభుత్వం వినూత్న పాలసీల ద్వారా అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీల కు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేనంత గొప్ప ఇన్నోవేషన్ ఎకో సిస్టం ఉన్నదని తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్న టీ హబ్, టీ వర్క్స్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, మరియు రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ వంటి అనేక సంస్థలు ఈ రంగంలో గత ఆరు సంవత్సరాల్లో నెలకొల్పబడ్డాయని చెప్పారు.

Related posts