telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణకు వచ్చిన ర‌ష్యా స్పుత్నిక్ వ్యాక్సిన్…

corona vacccine covid-19

దేశంలో కరోనా కొర‌త రావ‌డంతో.. విదేశీ వ్యాక్సిన్ల‌కు సైతం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది భార‌త ప్ర‌భుత్వ. ఇప్ప‌టికే ర‌ష్యాలో మంచి ఫ‌లితాల‌ను ఇచ్చిన ఈ వ్యాక్సిన్‌లో ప్ర‌పంచంలోని ఇత‌ర దేశాలో భారీగా కొనుగోలు చేయ‌గా.. భార‌త్ కూడా ఆ జాబితాలో చేరిపోయింది.. దీంతో.. ర‌ష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తొలి క‌న్‌సైన్‌మెంట్ హైద‌రాబాద్ చేరుకుంది.. మాస్కో నుంచి ల‌క్షా 50 వేల డోసుల స్పుత్నిక్ వి వ్యాక్సిన్ల‌తో… శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో ల్యాండ్ అయ్యింది. ఈ వ్యాక్సిన్ల‌ను డాక్ట‌ర్ రెడ్డీస్.. డెలివ‌రీ చేసేందుకు సిద్ధ‌మైంది. భార‌త్‌లో ఈ వ్యాక్సిన్ త‌యారీకి ర‌ష్య‌న్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్‌)తో  డాక్ట‌ర్ రెడ్డీస్ లేబొరేట‌రీస్ డీల్ కుదుర్చుకున్న విష‌యం తెలిసిందే కాగా.. ఈ వ్యాక్సిన్‌కు గ‌త నెల‌లోనే డీసీజీఐ అనుమ‌తి ఇచ్చింది.  కాగా, స్పుత్నిక్ వీ యొక్క సమర్థత ప్రపంచంలోనే అత్యధికంగా తేలింది.. ఈ టీకా కోవిడ్ యొక్క కొత్త వేరియంట్ల‌కు వ్యతిరేకంగా కూడా ప్రభావవంతంగా ప‌నిచేస్తుంద‌ని.. దీని స్థానిక ఉత్పత్తి త్వరలో ప్రారంభం కానుంది మరియు క్రమంగా సంవత్సరానికి 850 మిలియన్ డోసులు వరకు పెంచాల‌న్న‌దే త‌మ ప్లాన్‌గా చెబుతోంది భారతదేశంలోని రష్యన్ రాయబారి.

Related posts