telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్ వారసుడు అకిరా నందన్ .. అడవి శేషుతో .. సినిమా ప్లానా …

adavi sesh with pavan son akira viral

ఇప్పుడు పవన్ వారసుడు అకిరా నందన్ అడవి శేషుని కలసి తీయించుకున్న ఫోటో పవన్ అభిమానుల మధ్య వైరల్ గా మారింది. సినిమా వాతవరణానికి చాల దూరంగా పెరుగుతున్న అకిరా నందన్ అడవి శేషును ఎప్పుడు ఎందుకు కలిసాడు అన్న విషయమై క్లారిటీ లేకపోయినా వీరిద్దరూ కలిసి తీయించుకున్న ఈ ఫోటోలో అకిరా లుక్ పై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఆరడుగుల ఒడ్డు పొడుగుతో కనిపిస్తున్న అకిరా లుక్ ను చూసిన పవన్ అభిమానులు అకిరాలో పవన్ పోలికల కంటే అతడి తల్లి రేణు దేశాయ్ పోలికలు ఎక్కువగా కనపడుతున్నాయని అంత పొడవైనా ఇంకా అకిరా మొఖంలో పసితనం ఛాయలు ఇంకా పూర్తిగా పోలేదని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు అకిరా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి కనీసం ఇంకా 6 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది అంటూ పవన్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం పూణే నుండి తన తల్లితో కలిసి హైదరాబాద్ కు తిరిగి వచ్చి ఇక్కడ ఒక ప్రముఖ అంతర్జాతీయ స్కూల్ లో చదువుకుంటున్న అకిరా తనకు ఖాళీ దొరికినప్పుడు పవన్ ఇంటికి వెళ్ళి అక్కడ చాలాసేపు ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే పవన్ మాత్రం అకిరా చదువు విషయంలో పూర్తి శ్రద్ద పెడుతూ అతడి చదువు పూర్తి అయిన తరువాత మాత్రమే అతడి సినిమాల ఎంట్రీ గురించి ఆలోచించే ఉద్దేశ్యంలో ఉన్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా నటించిన అడవి శేషు అంటే పవన్ కు ప్రత్యేకమైన అభిమానం. ఆ అభిమానం అకిరాకు కూడ కొనసాగుతూ ఉండటంతో అకిరా ఇలా అడవి శేషును కలిసాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. కారణాలు ఏమైనా అకిరా లేటెస్ట్ లుక్ బయటపడటంతో పవన్ అభిమానులు మంచి జోష్ లో ఉన్నారు.

Related posts