అడివిశేష్, రెజీనా కసండ్ర, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించగా రూపొందిన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ “ఎవరు”. వెంకట్ రామ్ జీ దర్శకుడిగా పరిచయం అయ్యారు. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాతలు. శ్రీచరణ్ పాకాల సంగీత సారథ్యం వహించారు. ఈ చిత్రానికి వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు సినిమాలోని ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నాయి. ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల ప్రశంసలు రాబట్టుకోవడమే కాకుండా, హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “ఎవరు” సినిమాను చూసి యూనిట్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. “ఎవరు టీమ్‌కి కంగ్రాట్స్. రాత్రే సినిమా చూశాను. ట్విస్టులు, టర్న్‌లతో కొనసాగే అమేజింగ్ మర్డర్ మిస్టరీ ఇది. సినిమా చాలా బావుంది. రైటింగ్ పరంగా, సాంకేతిక అంశాల పరంగా సినిమా బ్రిలియంట్. శేష్ వరుసగా ఆకట్టుకునే సినిమాలను చేస్తున్నారు. హ్యాట్రిక్ సాధించారు. రెజీనా, నవీన్ చంద్ర, మురళీశర్మ ఇతరులు చాలా చక్కగా నటించారు. నిర్మాత పీవీపీగారికి, డైరెక్టర్ వెంకట్ రామ్‌జీ గారికి అభినందనలు” అంటూ ట్వీట్ చేశారు.
previous post
రోజా నేను మంచి స్నేహితులం: ప్రియారామన్