telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అజిత్ అభిమానిపై కత్తి దాడి

Vijay-and-Ajith

త‌మిళ స్టార్ హీరోలు అజిత్, విజ‌య్ అభిమానుల మ‌ధ్య జరుగుతున్న వార్ ఇప్పట్లో చల్లారేలా కన్పించడం లేదు. నిన్న‌టి వ‌ర‌కు అజిత్ అభిమానులు విజ‌య్ చ‌నిపోయిన‌ట్టు రిప్ విజ‌య్ హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ చేశారు. ఇందుకు విజ‌య్ అభిమానులు లాంగ్ లివ్ విజ‌య్ అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ చేశారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఇరు హీరోల అభిమానుల మ‌ధ్య వార్ నడుస్తోంది. ఈ క్ర‌మంలో అజిత్ అభిమానిపై న‌టుడు విజ‌య్ అభిమాని క‌త్తితో దాడి చేయ‌డం ఇప్పుడు కోలీవుడ్ లో సంచల‌నంగా మారింది. పుళల్‌ సమీపంలోని కావంగరైలో శ్రీలంక శరణార్థుల శిబిరంలో నివశిస్తున్న ఉమాశంకర్‌ (32), రోషన్‌ (34) ఇద్దరు క‌లిసి మాట్లాడుకుంటున్నారు. ఉమా శంక‌ర్ అజిత్ అభిమాని కాగా, రోష‌న్ విజయ్‌ అభిమాని. హీరోల గురించి మాట్లాడుకుంటున్న స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య బేధాభిప్రాయాలు రావ‌డంతో రోష‌న్.. అజిత్ అభిమాని అయిన ఉమాశంక‌ర్‌పై క‌త్తితో దాడి చేశాడు. ఈ విష‌యాన్ని గమ‌నించిన స్థానిక‌లు పాడియ నట్లూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్చారు. ప్ర‌స్తుతం అత‌ని ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు తెలుస్తుంది. అయితే ఈ విష‌యం తెలుసుకున్న పోలీసులు వెంట‌నే రంగంలోకి దిగి రోషన్‌ను అరెస్ట్‌ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ స్టార్ హీరోలు కలగజేసుకుని అభిమానులను శాంతింపజేస్తే మంచిదంటున్నారు సినీ విశ్లేషకులు.

Related posts