తెలుగులో భారీ విజయాన్ని సాధించిన “అర్జున్ రెడ్డి” చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో తొలుత ఈ చిత్రాన్ని బాల దర్శకత్వంలో రీమేక్ చేశారు. “వర్మ” అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఔట్పుట్ అనుకున్నంత బాగా రాకపోవడంతో ఈ సినిమాని మధ్యలోనే ఆపేసి, సందీప్ రెడ్డి వంగ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన గిరీశాయ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నారు. “ఆదిత్యవర్మ” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2019, జూన్‌లో ఈ విడుదల చేస్తాము అని నిర్మాణ సంస్థ తెలిపింది. ఆ”దిత్యవర్మ” చిత్ర రిలీజ్‌కి సంబంధించి కొద్ది రోజులుగా అనేక వార్తలు వినిపిస్తున్నాయి. కాని దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న భారీ సంఖ్యలో విడుదల కానుందని చెబుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన రానుంది. ఈ చిత్రానికి రధన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక సినిమాటోగ్రాఫర్‌గా రవి కె చంద్రన్ పని చేస్తున్నారు. ధృవ్ విక్రమ్ సరసన అక్టోబర్ చిత్ర ఫేం బానిటా సందు హీరోయిన్ గా నటిస్తుంది. ఈ4 ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియా ఆనంద్ మరో హీరోయిన్గా నటిస్తుంది. ఇటీవల చిత్ర టీజర్ విడుదల కాగా దీనికి మంచి రెస్పాన్సే వచ్చింది.
next post