telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆకట్టుకుంటున్న “చోక్డ్” ట్రైలర్

Choked

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ ఈ ఏడాది నెట్ ఫ్లిక్స్ ద్వారా మరో చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇప్ప‌టికే ఆయ‌న గోస్ట్ స్టోరీస్ అనే చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌ల చేయ‌గా, జూన్ 5న‌ ‘చోక్డ్’ అనే మూవీని విడుద‌ల చేయ‌నున్నారు. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ‘చోక్డ్’ చిత్రం బ్యాంక్ క్యాషియర్ జీవితంలో జ‌రిగిన ఊహించిన సంఘ‌ట‌నల‌తో తెర‌కెక్కింది. సొంత ఇంట్లోని కిచెన్‌లో మ‌హిళ‌కి అప‌రిమిత‌మైన డ‌బ్బు క‌నిపించిన‌ప్పుడు ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతుంది. న‌గ‌దు కొర‌త‌తో ఇబ్బంది ప‌డుతూ వ‌స్తున్న బ్యాంక్ క్యాషియ‌ర్ స‌యామి ఖేర్ .. ప్ర‌తి అర్ధరాత్రి తన కిచెన్ సింక్ నుండి బయటకు వచ్చే నగదుని చూసి షాక్ అవుతుంది.అప్ప‌టి వ‌ర‌కు స్తబ్దుగా ఉన్న జీవితం పూర్తిగా మారుతుంది. దీంతో స‌యామీ ఆమె భర్త రోషన్ మాథ్యూ పై అనుమానాలు క‌లుగుతాయి. ట్రైల‌ర్ ఆద్యంతం ఆస్తిక‌రంగా ఉండ‌గా, సినిమా ప్రియుల‌తో పాటు నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. నిఖిల్ అద్వానీ, హ‌న్స‌ల్ మెహ‌తా, అనుభ‌వ్ సిన్హా త‌దితరులు ట్రైల‌ర్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. ‘చోక్డ్’ చిత్రం రోష‌న్ మాథ్యూ, స‌యామీ ఖేర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్క‌గా ఇందులో అమృతా సుభాష్‌, రాజ‌శ్రీ దేశ్‌పాండే స‌పోర్టింగ్ రోల్స్ పోషించారు. క‌ర్ష్ క‌లే బాణీలు స‌మ‌కూర్చారు.

Related posts