telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని హీరో ?

akhil

యంగ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా మూడు సినిమాలు చేసినప్పటికీ సరైన హిట్ అందుకోలేదు. కాగా ప్రస్తుతం అఖిల్ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ మూవీ చేస్తున్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ మూవీపై అఖిల్ చాలా ఆశలే పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా ఈ యంగ్ హీరో మన టాలీవుడ్ లో స్టైలిష్ ఫిల్మ్ మేకర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయనున్నారని టాక్ బయటకు వచ్చింది. “సైరా” తర్వాత సురేందర్ రెడ్డి నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రకటించకపోవడంతో చాలానే రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి అఖిల్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుందా ? లేదా ? అనేది చూడాలి.

Related posts