telugu navyamedia
సినిమా వార్తలు

సూర్య “ఎన్జీకే” ప్రోమోలు విడుదల

surya ngk movie teaser

సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న తాజా చిత్రం “ఎన్జీకే”. ఈ సినిమాలో సూర్య సరసన రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి నటిస్తున్నారు. ఎస్.ఆర్.ప్రభు నిర్మాణంలో నిర్మితమవుతున్న ఈ పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

మే 31న భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఫస్ట్ లుక్ విడుదలైనప్పట్నుంచే సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కానీ సినిమా విడుదలలో జాప్యం కారణంగా సూర్య అభిమానులు కాస్త నిరాశ చెందారు. తాజాగా ఈ చిత్రం నుంచి ప్రోమోలను విడుదల చేశారు. ఈ ప్రోమోలను మీరు కూడా వీక్షించండి. 

Related posts