కన్నుగీటి రాత్రికి రాత్రే సెన్సేషనల్ స్టార్‌గా మారిపోయిన మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్. ఆమె మొదటి చిత్రం “ఒరు ఆడార్ లవ్” గత ఏడాది విడుదలైంది. కానీ ఈ చిత్రం ఆమెకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం హీరోయిన్‌గా పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది ప్రియా. ప్రస్తుతం ప్రియా ప్రకాశ్ “శ్రీదేవి బంగ్లా” అనే బాలీవుడ్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించేందుకు సిద్దమైంది. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది ఈ అమ్మడు. టాలీవుడ్ లవర్ బోయ్ నితిన్ 28వ సినిమాగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ కథానాయికలుగా నటించనున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. నితిన్ సినిమాతోనే ఆమె తెలుగు డెబ్యూ ఇస్తుంది. అయితే కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోఉంటున్న ప్రియా ప్రకాశ్ యూత్ ఫుల్ హీరో విజయ్ దేవరకొండని కలిసింది. ఆయనతో ఫోటో దిగి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. “నువ్వంటే నాకు చాలా ఇష్టం” అనే కామెంట్ ఫోటోకి పెట్టింది. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
previous post
next post
పదిహేనేళ్ల క్రితం నుంచే ఆలియా అంటే ఇష్టం : రణబీర్ కపూర్