telugu navyamedia
సినిమా వార్తలు

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య మ‌ళ్ళీ ప్రేమించ‌డానికి రెడీ..?

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ‘లాల్ సింగ్ చద్దా సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో చైతు.. బాలరాజు అనే ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Naga Chaitanya Reacts To Finding Love Again Post Separation From Samantha | Naga  Chaitanya: చైతు మళ్లీ ప్రేమలో పడతారా? ఇదిగో సమాధానం!

ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు చైతు. హిందీలో చైతుకి తొలి సినిమా కావడంతో బాలీవుడ్ మీడియాకు వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో చైతుకి తన వ్యక్తిగత జీవితం, సమంతతో విడాకులు వంటి ఎన్నో ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటన్నింటికీ తనదైన స్టైల్ లో సమాధానాలు చెప్పుకొచ్చారు.

Who spread Naga Chaitanya's relationship rumors? Find out here

మీరు మళ్లీ ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నారా..? అనే ప్రశ్న చైతుకి ఎదురైంది. దీనికి స్పందించిన ఆయన ‘ఏమో ఎవరికి తెలుసు. ఏదైనా జరగొచ్చు. ప్రేమ అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. ప్రేమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. మనం జీవించడానికి గాలి ఎంత ముఖ్యంలో.. మన జీవితంలో ప్రేమ కూడా అంతే ముఖ్యం. మనం ప్రేమించాలి. ప్రేమను స్వీకరించాలి. అప్పుడే మన జీవితం ఆరోగ్యవంతంగా, సానుకూలంగా సాగుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు.

Naga Chaitanya open to finding love again? Laal Singh Chaddha actor says, ' Love is what keeps us going'

చైతు-సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన నాలుగేళ్లకే ఈ జంట విడాకులు తీసుకుంది. నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్నారంటే ఎవరికి నమ్మాలి అనిపించలేదు. వీరు విడిపోవడంతో ఫ్యాన్స్ ఎంతో బాధపడ్డారు.ప్రస్తుతం వీరిద్దరూ తమ జీవితాల్లో బిజీగా ఉన్నారు.

Naga Chaitanya on Dating Rumours, Divorce from Samantha: 'It Disturbs Me  When My Personal Life...' - Thelocalreport.in

ఈ మధ్యకాలంలో చైతు.. శోభితా దూళిపాళ్లతో ప్రేమలో పడ్డాడంటూ వార్తలు వినిపించాయి. ఇందులో నిజం లేదంటూ పరోక్షంగా శోభితా వెల్లడించింది. ఇదే విషయమై చైతుని ప్రశ్నించగా.. నవ్వేసి ఊరుకున్నారు. చైతు నవ్వుకి అర్ధమేంటా అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Related posts