telugu navyamedia
Uncategorized సినిమా వార్తలు

ప్రేమ బాసలు..

ni madilo poetry cornerni madilo poetry cornerni madilo poetry cornerni madilo poetry cornerni madilo poetry corner
ప్రాణ సఖీ!
నయనాల ఉయ్యాలో
కనుపాపలా పవళింప జేస్తాను
హృదయ కోవెలలో
ప్రేమ దేవతగా ప్రతిష్ఠించుకుంటాను
నా శ్వాసనాళాలల్లో నీ ప్రేమ ఊపిరిని నింపుకుంటాను
నీవే ప్రేమ పుష్పమైతే
వలపుల తుమ్మెదనై
వాలి,వాటేసుకుంటాను
నీ ఆలింగన వెచ్చదనమును
పచ్చని ప్రణయ పాన్పుగా
మార్చుకుంటాను
నా భుజాల కొమ్మలపై 
ప్రేమ గూడు కడుతాను
ప్రేమ పావురమై సేదదీర్చుకో ! చెలీ!!
ప్రేమ ఊసులు,చేసిన బాసలు
నింగి,నేల సాక్షిగా నెరవేర్చుకుంటాను
నీ పరువాల పందిట్లో
ప్రమాణం చేస్తున్నాను.
హృదయ ప్రేమ పుస్తకంలో
వలపుల సంతకం పెడుతున్నాను.
-గద్వాలసోమన్న, ఎమ్మిగనూరు

Related posts