telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

సంక్రాంతి రేస్ లో రవితేజ..?

Krack

ఈ కరోనా టైం లో సినిమాలను థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఇప్పడు సినిమా విడుదల చేస్తే ప్రేక్షకులు థియేటర్లకు అసలు వస్తారా లేదా అనేదాని గురించి జుట్టుపీక్కుంటున్నారు. థియేటర్లు తెరుచుకున్నా ప్రేక్షకులు రాకపోతే నష్టాలు వస్తాయని వారు భావిస్తున్నారు. సంక్రాంతికైనా కరోనా బెడద తీరితే విడుదల చేయవచ్చని, అప్పడు నష్టాల నుంచి బయటపడేందుకు చాన్సులు ఉన్నాయన్నా ఆశాభావం వ్యక్తమవుతోంది. అయితే  ఈ సమయంలో సినిమాను విడుదల చేయడం అంటే సాహసమే చెప్పుకోవచ్చు. అయితే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఈ సాహసానికి సిద్దమయ్యాడు. ఈ ఏడాది క్రిస్మస్‌కు తన సినిమా సోలో బ్రతుకే సో బెటర్‌ను విడుదల చేయనున్నాడు. దీని తరువాత సంక్రాతి రేసులో మొదట అనేక సినిమాలు ఉన్నా వారు ఇంకా విడుదలపై పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా మాస్ మహారాజ్ చేసిన సినిమా క్రాక్ సంక్రాంతికి విడుదల చేస్తామని దర్శకుడు తమన్ తెలిపాడు. ఈ సినిమా ప్రస్తుతానికి చిత్రీకరణ అనంతరం పనులను పూర్తి చేసుకుంటుందని, దీనికి సంబంధించిన ట్రైలర్‌ను త్వరలో విడుదల చేస్తామని ఆయన తెలిపాడు.

Related posts