telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మర్డర్ : తమ జీవితాలతో సినిమా దర్శకులు, నిర్మాత చెలగాటమాడుతున్నారంటూ అమృత ఫైర్

amrutha

వివాదాస్పద సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘మర్డర్‌’ అనే సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ‘మర్డర్’ సినిమాను దర్శకుడు ఆనంద్ చంద్ర తెరకెక్కించారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. మంగళవారం ఈ చిత్రానికి సంబంధించిన ‘పిల్లల్ని ప్రేమించడం తప్పా’ అనే పాటను సోషల్ మీడియా వేదికగా రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. దీంతో ఈ సినిమాపై అమృత ప్రణయ్ సహా కుటుంబ సభ్యులు స్పందించారు. రెండేళ్ల క్రితం మిర్యాలగూడలో సంచలనం రేపిన అమృత, ప్రణయ్ కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ ఘటన యావత్ దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో మంగళవారం నాడు ఈ మూవీకి సంబంధించి అమృత, ప్రణయ్ కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మూవీపై అమృత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జీవితాలతో సినిమా దర్శకులు, నిర్మాత చెలగాటమాడుతున్నారంటూ ఆమె ఫైర్ అయ్యారు. ప్రణయ్ కుటుంబ సభ్యులు కూడా ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ అనుమతి లేకుండా తమ పేర్లు, నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ‘మర్డర్’ సినిమా తీసి తమ జీవితాలపై ప్రభావం చూపుతున్నారని అభ్యంతరం తెలిపారు.

అయితే, మర్డర్ చిత్రంలో తమ పేర్లు, ఫోటోలు అక్రమంగా వాడుకున్నారని, తమ అనుమతి లేకుండా తీసిన ఈ సినిమాను నిలిపివేయాలని గత నెల 29న నల్గొండ జిల్లా కోర్టులో అమృత ప్రణయ్, కుటుంబ సభ్యులు వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో మెయిల్ ద్వారా కోర్టు దర్శకుడికి, నిర్మాతకు నోటీసులను మెయిల్ చేసింది. ఈ నెల 6న నల్గొండ కోర్టులో దర్శకుడు, నిర్మాత విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.

Related posts