telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

కమల్ తో .. లారెన్స్ భేటీ.. అభిమానులారా శాంతిశాంతి ..

larence meet kamal hasan on comments

ఇటీవల రాఘవ లారెన్స్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో కమల్‌హాసన్‌తో నేరుగా సమావేశమయ్యారు. రజనీకాంత్‌ నటించిన ‘దర్బార్‌’ ఆడియో వేడుకలో లారెన్స్‌ మాట్లాడుతూ తాను చిన్నతనంలో రజనీకాంత్‌పై ఉన్న అభిమానం, ప్రేమతో.. కమల్‌హాసన్‌ పోస్టర్లపై పేడ వేసేవాడినన్నారు. అప్పటి ఆలోచన, పరిపక్వత అలాంటిదని వివరించారు. ఆ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. కమల్‌ అభిమానులు ఆయనపై విరుచుకుపడ్డారు. ఇటీవల చెన్నైలో జరిగిన రజనీకాంత్‌ 70వ పుట్టినరోజు వేడుకల్లో లారెన్స్‌ పాల్గొని దీనికి వివరణ ఇచ్చారు. కమల్‌హాసన్‌ను నేను విమర్శించాననే కోణంలో ఎవరూ ఆలోచించవద్దని కోరారు. రజనీకాంత్‌, కమల్‌లు స్నేహ భావంతో కలిసి నడుస్తున్నప్పుడు, వారి అభిమానులైన మనం ఎందుకు గొడవపడటం, వాళ్లలానే కలిసి నడుద్దామని చెప్పడమే తన ఉద్దేశమని పేర్కొన్నారు.

‘తలైవన్‌ ఇరుక్కిరాన్‌’ చిత్రంలో నన్ను నటించమని కమల్‌ ఇటీవల ఆహ్వానించారని, అయితే ‘కాల భైరవ’ చిత్రంలో బిజీగా ఉన్నందున కాల్షీట్‌ లేకపోవడంతో నటించలేకపోయానన్నారు లారెన్స్. అలాంటి గొప్ప వ్యక్తిని తాను ఎలా విమర్శించగలనని ప్రశ్నించారు. దీంతో కమల్‌ అభిమానులు కాస్త శాంతించారు. ఈ నేపథ్యంలో కమల్‌తో లారెన్స్‌ సమావేశమయ్యారు. కాసేపు మాట్లాడిన అనంతరం కమల్‌తో ఫొటో దిగారు. దీనిపై లారెన్స్‌ స్పందిస్తూ.. నా వివరణను అర్థం చేసుకున్న కమల్‌ నన్ను కుశల ప్రశ్నలు వేశారు. ఆయనకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్న చెప్పారు.

Related posts