telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“భారతీయుడు-2” నుంచి కమల్ హాసన్ లుక్ విడుదల

Indian

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న చిత్రం ఇండియ‌న్ 2. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని రూ.180 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీతోపాటు ఇతర భారతీయ భాషల్లోనూ ఈ చిత్రాన్ని ఏక కాలంలో రూపొందిస్తున్న‌ట్టు తెలుస్తుంది. చిత్రంలో కమల్‌హాసన్‌కి జోడీగా కాజల్ న‌టించ‌నున్నారు .దుల్కర్‌ సల్మాన్‌ కీలక పాత్రలో, అజయ్‌ దేవ్‌గణ్‌ నెగటివ్‌ పాత్రలో నటిస్తారని సమాచారం. శింబు కూడా ముఖ్య పాత్ర చేయ‌నున్నాడ‌ని అంటున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. అనిరుధ్ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, గ్వాలియ‌ర్‌ల‌లో కొద్దిరోజులుగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా తాత్కాలిక బ్రేక్ వేసిన‌ట్టు తెలుస్తుంది. క‌మ‌ల్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిత్రంలో క‌మ‌ల్‌కి సంబంధించి లుక్ విడుద‌ల చేశారు. ఇందులో ఎత్తైన కోట‌పై నిలుచొని ఏదో ఆలోచిస్తున్న‌ట్టుగా ఉన్నారు క‌మ‌ల్. అతి త్వ‌ర‌లోనే చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌నున్నారు.

Related posts