telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

“అలా వైఎస్ అవినీతి పురం” సినిమా తీయండి : వర్మకు టీడీపీ నేత రిక్వెస్ట్‌

టీడీపీ సీనియర్ నేత బండారు సత్య నారాయణ మూర్తి వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మను సెంటర్‌ పాయింట్‌గా చేసుకుని జగన్‌పై విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై వ్యంగ్యంగా బండారు సత్య నారాయణ మూర్తి విమర్శలు చేశారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాంగోపాల్ వర్మకు బండారు సత్య నారాయణ మూర్తి ఓ రిక్వెస్టు చేశారు. ఏపిలో భారీ ఎత్తున జరుగుతున్న ఇళ్ల స్థలాల అవినీతి పై వర్మ సినిమా తీయాలని కోరారు. ఆ సినిమాకు…”అలా వైఎస్ అవినీతి పురం పేరు పెట్టాలని కోరారు బండారు సత్య నారాయణ మూర్తి. తాను నటుడినే.. ఆ సినిమాలో నటిస్తానని కూడా పేర్కొన్నారు. అంతేకాదు… ముఖ్యమంత్రి జగన్ పాత్ర పోషిస్తానని… ఎందుకంటే తానును జగన్ ని బాగా స్టడీ చేసానని తెలిపారు. ఆయన చేసిన అవినీతి తనకు బాగా తెలుసునని.. అందుకే ఆ పాత్ర పోషించాలని అనుకుంటున్నానని స్పష్టం చేశారు. వర్మ అవకాశం ఇస్తే.. తప్పకుండా నటిస్తానని తెలిపారు బండారు సత్య నారాయణ మూర్తి.

Related posts