telugu navyamedia
సినిమా వార్తలు

“బిగ్ బాస్”పై పోలీసులకు గాయత్రి గుప్తా ఫిర్యాదు

Gayatri-Gupta

టీవీ షోలలోకెల్లా బాస్ అని పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో ప్రసారం అవుతున్న సంగతి అందరికి తెలిసిందే… గత రెండు సంవత్సరాలుగా ఘన విజయం సాధించిన టీవీ షో ప్రస్తుతం వివాదాలకు దారీ తీస్తుంది. మొత్తం 100 రోజుల పాటు 16 మంది సభ్యులు ఒకే ఇంటిలో ఉండి వారి జీవితంలో జరిగిన విషయాలను సాధారణ ప్రజలుగా ఒకరికొకరు తెలుసుకుంటారు. బిగ్ బాస్ షోలో నటించిన వారు టాస్క్ ల ఆధారంగా ఎలిమినేట్ అవుతూ… చివరకు ఒక్కరే విజేతగా నిలుస్తారు. ప్రస్తుతం ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను సంపాదించుకున్న బిగ్ బాస్ సిరిస్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు వివాదాలకు దారి తీస్తుంది. తాజా బిగ్ బాస్ పై యాంకర్ శ్వేతారెడ్డి సంచనల కామెంట్స్ చేసింది.

తాజాగా నటి గాయత్రి గుప్తా రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బిగ్‌బాస్‌ షోకి రావడానికి సిద్ధమేనా అని రఘు అడిగాడని, వంద రోజులపాటు హౌస్‌లోనే ఉండాల్సి వస్తుందని అన్నారని గాయత్రి గుప్తా తెలిపింది. తాను సరేననడంతో వేరే ప్రాజెక్టులు ఒప్పుకోవద్దన్నారని పేర్కొంది. అభిషేక్, రఘు, రవికాంత్‌లు తన ఇంటికి వచ్చి అగ్రిమెంట్ చేయించుకున్నారని వివరించింది. ఈ సందర్భంగా బిగ్‌బాస్‌లోకి వెళ్లాలంటే పైవారిని ఎలా సంతృప్తి పరుస్తారని రఘు అడిగారని, అలా ఎందుకని తాను ఘాటుగా ప్రశ్నించానని గాయత్రి తెలిపింది. ఆ తర్వాత ఒకరోజు తనకు ఫోన్ చేసి బిగ్‌బాస్ షోకి ఎంపిక కాలేదని చెప్పారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. షోకు ఎంపిక చేశారన్న ఉద్దేశంతో చేతిలో ఉన్న ఆరు సినిమాలను వదిలేసుకున్నానని వాపోయింది. ఆ నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని షో నిర్వాహకులను అడిగానని, వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతోనే పోలీసులను ఆశ్రయించానని గాయత్రి తెలిపింది.

Related posts