telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

కంగనాకు బెదిరింపులు… రేప్ చేస్తానంటూ

Kangana

టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రస్తుతం మనాలీలో తన బ్రదర్ మ్యారేజ్ పనుల్లో బిజీగా వుంది. ఈ మ్యారేజ్‌కు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. రీసెంట్‌గా కంగనా షేర్ చేసిన ఫోటోలపై ఒడిశాకు చెందిన ఓ న్యాయవాది తన ఫేస్‌బుక్ పేజీలో కామెంట్స్ చేశాడు. కంగనా… నీ ఓవర్ యాక్షన్ చాలు.. లేకపోతే నడిరోడ్డుపై అత్యాచారం చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఐతే, సదురు లాయర్ మాత్రం తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తన అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేసి తన అకౌంట్ ద్వారా ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని అతను వ్యాఖ్యానించాడు. తన స్నేహితుల ద్వారా ఈ విషయం తెలుసుకుని షాక్ అయ్యానని.. ఎవరి మనోభావాలైనా దెబ్బతిని వుంటే క్షమించాలని కోరారు. ప్రస్తుతం కంగనా జయలలిత జీవిత చరిత్రపై తెరకెక్కుతోన్న ‘తలైవి’ సినిమా చేస్తోంది. కాగా..కంగనా గత కొన్ని రోజులుగా వార్తల్లోకి ఎక్కుతుంది. సుశాంత్ కేసులోను సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 

Related posts