telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

పండుగ వేళ : ఫోన్‌ పేలో డిస్కౌంట్లు, ఆఫర్లు వెల్లువ

Phone-Pay

దసరా పండుగ దగ్గర పడింది. దీంతో అందరు ఎక్కడ ఆఫర్లు వస్తాయని చూస్తున్నారు. తాజాగా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ సంస్థ ఫోన్‌పే (PhonePe) తమ కస్టమర్లకు ఆఫర్లు, డిస్కౌంట్ల పండగ మొదలెట్టింది. ఆన్‌లైన్‌ రీఛార్జిలు, ట్రెండీ ఫ్యాషన్‌ కొనుగోళ్లు, గోల్డ్ కొనుగోలు, తదితరాలపై ఫోన్‌పే పలు ఆఫర్లను అందిస్తుంది. రూ.1000 వరకు క్యాష్‌ బ్యాక్‌లు, షాపింగ్‌పై 70 శాతం వరకు డిస్కౌంట్లు కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక ఆఫర్ల శ్రేణి అక్టోబర్‌ 31 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. చాలా రోజుల నుంచి ఫోన్ స్విచ్ ద్వారా అనేక సేవలను ఫోన్ పే తన కస్టమర్ల కోసం ఆఫర్లను అందిస్తోంది. ప్రస్తుతం పండగ సీజన్ కావడంతో అందుకు తగిన విధంగానే తన యూజర్లకు డిస్కౌంట్లను ఇస్తున్నట్లుగా పేర్కొంది. ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఫోన్ పే తన కస్టమర్ కోసం వివిధ రకాల భారీ ఆఫర్లతో సురక్షితమైన మరియు కాంటాక్ట్ లెస్ షాపింగ్ పేమెంట్ అనుభవాన్ని తీసుకువచ్చింది.

Related posts