telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దుబ్బాక ఎఫెక్ట్‌ : మరో శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్‌

దుబ్బాక ఓటమి అనంతరం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్రమత్తం అయినట్టు స్పష్టంగా కన్పిపిస్తోంది. ఎందుకంటే సీఎం కేసీఆర్‌ వరుస భేటీలు నిర్వహించి.. ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జీహెచ్‌ఎంసీ కార్మికులకు జీతాలు పెంపు, మున్సిపాలిటీల్లో ఉన్న వారికి ఆస్తి పన్నులో 50 శాతం సబ్సిడీ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. తాజాగా ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్‌ తీపి కబురు చెప్పారు. ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. కోవిడ్ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల జీతంలో 2 నెలల పాటు కోత విధించిన 50 శాతం మొత్తాన్ని చెల్లించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు ₹ 120 నుంచి ₹ 130 కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీలో ఉద్యోగ భద్రతపై త్వరలో విధానపర నిర్ణయం తీసుకున్నారు. పార్సిల్ సర్వీసుల బిజినెస్ 1 మిలియన్ దాటిన నేపథ్యంలో ఆర్టీసీ అధికారులను అభినందించిన ముఖ్యమంత్రి కేసీఆర్… ఇకపై హైదరాబాద్ లో 50 శాతం బస్సులను పునరుద్ధరించాలని ఆర్టీసీ ఎండీ సునీల్ కుమార్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

Related posts