telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

సీఎం అభ్యర్థి వాళ్లు అయితేనే బాగుండేది

ఇవాళ మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీహార్‌ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీశ్‌ కుమార్‌ ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఇటీవల జరిగిన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 74 స్థానాలు దక్కించుకున్న బీజేపీ సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించింది. ఎన్నికల ప్రక్రియకు ముందే నితీశ్‌కుమార్‌ను ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రధాని మోడీ ప్రకటించారు. ఎన్నికల్లో జేడీయూ కంటే బీజేపీకి రెట్టింపు సీట్లు వచ్చినా… మిత్ర ధర్మాన్ని అనుసరించి నితీశ్‌కుమార్‌కు సీఎం అభ్యర్థిగా ఖరారు చేశారు. అయితే.. ఈ తరుణంలో నితీష్‌ కుమార్‌ సీఎం అభ్యర్థిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎంగా బీజేపీ అభ్యర్థి ఉంటే బాగుండేదని, కానీ బీజేపీ నేతల కోరిక మేరకే తాను సీఎంగా ప్రమాణం చేయబోతున్నానని చెప్పారు. తనకు మద్దతిస్తున్న ఎన్డీయే ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌ కు సమర్పించారని.. డిప్యూటీ సీఎం అభ్యర్థిపై చర్చించమన్నారు. కానీ డిప్యూటీ సీఎంపై ఇంకా క్లారిటీ రాలేదని పేర్కొన్నారు. కాగా… జేడీయూకు బీజేపీ కన్నా తక్కువ సీట్లు వచ్చినప్పటికీ నితీశ్‌ కుమార్‌నే సీఎంగా ఎన్నుకుంటామని బీజేపీ అగ్ర నేతలు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే..

Related posts