యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో బాలీవుడ్ లో నెపోటిజంపై తీవ్ర దుమారం రేగింది. నెపోటిజంపై బాలీవుడ్ స్టార్లపై తీవ్ర విమర్శలతో మండిపడ్డారు నెటిజన్లు. ఈ విషయంపై కొందరు స్టార్లతో పాటు యంగ్ నటీనటులు సైతం తమకు నెపోటిజం వల్ల తాము ఎదుర్కొన్న పరిణామాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ క్రమంలో నటుడు విద్యుత్ జమ్వాల్ తాజాగా నెపోటిజం పై స్పందిస్తూ “సినీ పరిశ్రమలో నువ్వు బయటి వ్యక్తివి అని తెలియజేసే సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఈ వ్యవస్థ అలా ఉంది. దీన్ని ఎవరూ ఖండించలేరు. కానీ ఏం చేస్తాం? నేను మార్చాలనుకుంటుంది ఒక్కటే. ఎవరూ ఏ మనిషిని పట్టించుకోకుండా ఉండకూడదు. వారు చూసిన ప్రతి దానిని అభినందించాలి. దీనికి బంధుప్రీతికి సంబంధం లేదు. కేవలం మంచి మనిషిగా ఉండాలి. ఎవరైనా ఎదైనా చేస్తే వారికి గుర్తింపు ఇవ్వాలి. మేం చేసే పనికి ప్రజలు మాపై ప్రేమ కురిపిస్తారు. కానీ సినీ పరిశ్రమలోని వ్యక్తులే మమ్మల్ని గుర్తించరు. కనీసం ట్వీట్ కూడా చేయరు” అని ఆవేదన వ్యక్తం చేసాడు. విద్యుత్ జమ్వాల్ కు సైతం ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేరని, అయినా స్వశక్తితో ఎదిగాడని మంచి పేరుంది. కెరీర్‌లో మొదట్లో విలన్‌గా నటించినా, ‘కమాండో’ సిరీస్‌తో హీరోగా మారిపోయాడు.