telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కార్పొరేటర్లతో నేడు మంత్రి కేటీఆర్‌ కీలక సమావేశం

గ్రేటర్ ఎన్నికలు మంచి రసవత్తరంగా సాగియి. ప్రజలలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అనుకున్నదానికంటే ఎక్కవగానే నెలకొంది. చిట్టచివరికి గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 55 సిట్లతో ముందంజలో ఉండగా బీజేపీ 48 సిట్లతో రెండో స్థానంలో నిలుచుంది. ఇక మరో ప్రాంతీయ పార్టీ ఎంఐఎం 44 సీట్లతో మూడవస్థానాన్ని ఆక్రమించుకుంది. అయితే.. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి అనుహ్య పరిణామం ఎదురైంది. సగానికి సగం సీట్లు పడిపోయాయి. దీంతో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. ఈ నేపథ్యంలో ఇవాళ మంత్రి కేటీఆర్‌ కీలక సమావేశానికి సిద్దమయ్యారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కార్పొరేటర్లతో పాటు.. గ్రేటర్‌ పరిధిలోని ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించారు కేటీఆర్‌. ఇక.. ఈ భేటీలో గ్రేటర్‌ ఫలితాలపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉండగా.. పొత్తులపై కూడా ఓ నిర్ణయానికి వస్తారా ? అనే చర్చ సాగుతోంది. కాగా.. గ్రేటర్‌ మేయర్‌కు మరో రెండు నెలల సమయం ఉంది. అప్పటి వరకు చూద్దామని కేటీఆర్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే..

Related posts