telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విక్రమ్ ‘కోబ్రా’ నుంచి ఇర్ఫాన్ పఠాన్ ఫస్ట్‌లుక్

Cobra

విల‌క్ష‌ణ నటుడు చియాన్ విక్ర‌మ్ ప్ర‌స్తుతం “కోబ్రా” సినిమాలో నటిస్తున్నాడు. అజయ్‌ ఙ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో విక్రమ్‌ ఏడు పాత్రల్లో కనిపించనున్నారు. కేజీఎఫ్‌ ఫేమ్‌ శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. సర్‌జానో, కేఎస్‌ రవికుమార్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించనున్నారు. 7 స్క్రీన్‌ స్టూడియోస్‌, వియకామ్‌ 18 సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ద్వారా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌ వెండితెరపైకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక మంగళవారం పఠాన్ పుట్టినరోజు సందర్భంగా కోబ్రా నుంచి ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేశారు. ఇందులో అస్లన్‌ ఇల్మజ్‌ ఏ ఫ్రెంచ్‌ ఇంటర్‌పోల్‌ ఆఫీసర్ పాత్రలో ఇర్ఫాన్ నటిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.

Related posts