telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

“సెంట్రల్‌ విస్టా” ప్రాజెక్టుకు సుప్రీం కోర్టు అనుమతి

“సెంట్రల్‌ విస్టా” ప్రాజెక్టుకు సుప్రీం కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కొత్త పార్లమెంట్‌కు అన్ని అనుమతులు సరిగ్గా ఉన్నాయని తీర్పును వెలువరించింది జస్టిస్ ఏ.ఎమ్. ఖానవిల్కర్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన సుప్రీం ధర్నాసనం. ఢిల్లీ నడిబొడ్డున “లుటెన్స్ ఢిల్లీ” ప్రాంతంలో 86 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పార్లమెంట్ భవనం, రాష్ట్రపతి భవన్, నార్త్, సౌత్ బ్లాక్ లు, ఇండియా గేట్ తదితర కట్టడాల పునరుద్దరణ, పునరాభివృధ్ది కార్యక్రమాలను సవాల్ చేసారు పిటీషనర్లు. అయితే… పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీం కోర్టు విచారించింది. ఈ పిటీషన్లపై సుప్రీంకోర్టు తీర్పును ఇస్తూ…. కొత్త పార్లమెంట్‌కు అన్ని అనుమతులు సరిగ్గా ఉన్నాయని తెలిపింది. కాగా.. 20 వేల కోట్లతో నూతన పార్లమెంట్‌ భవనం నిర్మిస్తున్నారు. డిసెంబరు 10 న “సెంట్రల్ విస్తా” ప్రాజెక్ట్ లో భాగమైన నూతన పార్లమెంట్ భవనానికి ప్రధాని మోడి శంఖు స్థాపన చేసిన విషయం తెలిసిందే. ఇక రాష్ట్రపతి భవన్ నుంచి “ఇండియా గేటు” వరకు 3 కిలోమీటర్ల దూరం వరకు, పచ్చదనానికి విఘాతం కలుగకుండా అభివృధ్ది చేయాలని ఆలోచన చేస్తున్నారు. “రాజపధ్” మార్గంకు ఇరువైపులా ఉన్న శాస్త్రి భవన్, కృషి భవన్, రైలు భవన్, ఉద్యోగ భవన్, నిర్మాణ భవన్, వాయుసేన భవన్ లను పడగొట్టి, సర్వహంగులతో ఒక్కొక్కటి 8 అంతస్తులుండే 10 నూతన భవనాలను నిర్మించేందుకు రూపకల్పన చేశారు. 

Related posts