telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి మృతికి సినీ ప్రముఖుల సంతాపం

Jayaprakash Reddy

ప్రముఖ టాలీవుడ్‌ నటుడు జయప్రకాశ్ రెడ్డి గుండెపోటుతో ఈ రోజు కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. లాక్‌డౌన్ నుంచి గుంటూరులోనే ఉంటున్న ఆయన ఈ ఉదయం స్నానాల గదిలో ఒక్కసారి కుప్పకూలాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించేలోపే తుదిశ్వాస విడిచారు. జయప్రకాశ్ స్వస్థలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని సిరివెళ్ల గ్రామంలో 8 మే 1946లో జన్మించారు. వెంకటేశ్ నటించిన “బ్రహ్మపుత్రుడు” సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమయ్యారు. రాయలసీమ యాసతో విలన్ పాత్రల్లో ఎన్నో సినిమాల్లో నటించారు. జయప్రకాశ్ రెడ్డి మృతి విషయం తెలిసి తెలుగు చిత్రపరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి బాధాకరం అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఈ మేరకు ”అద్భుతమైన నటనతో అందరినీ అలరించిన జయప్రకాష్ రెడ్డి గారు ఇక లేరు అనే వార్త బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను” అని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.

Related posts