ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులపై నిరసనలు వెల్లువిరుస్తున్న నేపేథ్యంలో అమరావతిపై ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని, పేదలకు ఇచ్చేందుకు ఇళ్ల స్థలాలు లేని ప్రాంతంలో రాజధాని ఎందుకని అన్నారు. ఈ విషయంలో తాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తోనూ చర్చించానని మ్నత్రి తెలిపారు.
అమరావతిలో పేదలకు 50 వేల ఇళ్ల పట్టాలను ప్రభుత్వం నిర్ణయించగా, వాటిని ఇవ్వవద్దంటూ నిరసనకారులు అడ్డుపడుతున్నారని నాని ఆరోపించారు. తన వాదనను విన్న తరువాత, సీఎం ఈ విషయాన్ని పరిశీలిస్తానని తెలిపారని నాని పేర్కొన్నారు. పలువురు ఇతర నేతలు, అమరావతి ప్రాంత పేదలను సంప్రదించిన తరువాతనే తాను శాసన రాజధానిని కూడా ఈ ప్రాంతం నుంచి తొలగించాలన్న డిమాండ్ ను తెరపైకి తెచ్చానని అన్నారు.
పవన్ వ్యాఖ్యలు ఓటర్లను అవమానించడమే: ఆర్జీవీ