టాలీవుడ్ లో ‘పేపర్ బాయ్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సంతోష్ శోభన్. ఆ తరువా ‘ఏక్ మినీ కథ’ సినిమాతో మంచి గుర్తింపు తెచుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో ‘ప్రేమ్ కుమార్’ సినిమా ఒకటి. వినోదమే ప్రధానంగా నిర్మితమైంది ‘ప్రేమ్ కుమార్’. అభిషేక్ మహర్షి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా సినిమా ఫస్టులుక్ తోనే అందరిలో ఆసక్తిని రేకెత్తించింది.
తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ ను విడుదల చేశారు. తన మనసుకు నచ్చే అమ్మాయి కోసం పెళ్లికొడుకుగా హీరో పడే పాట్లను కామెడీగా చూపించారు. సరదాగా ఉన్న ఫస్ట్ గ్లిమ్స్ అందరినీ నవ్విస్తోంది. ‘ప్రేమ్ కుమార్’ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన రాశీ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. సారంగ ఎంటర్టైన్మెంట్స్ పై.లి. పతాకంపై శివప్రసాద్ పన్నీరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టుగా కూడా చెప్పేశారు.