సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్స్‌లో రూపొందుతున్న ఎమోషనల్ డ్రామా “డియర్ కామ్రేడ్”. “యు ఫైట్ ఫర్ వాట్ యు లవ్” ట్యాగ్ లైన్. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 17న నాలుగు దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. సామాజిక బాధ్యత ఉన్న ఇన్‌టెన్సివ్ పాత్రలో విజయ్ దేవరకొండ మెప్పించనున్నారు. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా, సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ప్రముఖ టెలీకమ్యూనికేషన్స్ సేవల సంస్థ భారతీ ఎయిర్‌టెల్ (ఎయిర్‌టెల్), టాలీవుడ్ సినిమా “డియర్ కామ్రేడ్” టీంతో చేతులు కలిపింది. ఈ ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎయిర్‌టెల్ వినియోగదారులు “డియర్ కామ్రేడ్” తారాగణం హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నతోపాటు సినిమాలో నటీనటులను కలుసుకోవచ్చు. దీంతో పాటు “డియర్ కామ్రేడ్” ప్రమోషన్ కోసం మైత్రి మూవీ మేకర్స్‌తో ఎయిర్‌టెల్ కలిసి పని చేస్తోంది. ఎయిర్‌టెల్, డియర్ కామ్రెడ్ టీం మధ్య కుదిరిన ఈ ఒప్పందం వల్ల ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కేటగిరీలలో ప్రత్యేకమైన “డియర్ కామ్రేడ్’ ప్యాక్‌లు లాంచ్ చేయనున్నారు. రూ.169 ప్రీపెయిడ్‌తో రీచార్జ్ చేసుకున్నవారు, ఎయిర్‌టెల్ లైఫ్ స్టైల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ రూ.499 లేదా అంతకుమించి వినియోగదారుల్లోని లక్కీ కస్టమర్లు ఎయిర్‌టెల్ మీట్ & గ్రీట్‌లో భాగంగా “డియర్ కామ్రెడ్” సినిమాలో నటీనటులను కలుసుకునే అవకాశం కల్పించనున్నారు. దీంతోపాటుగా వినియోగదారులు ప్రత్యేకమైన డాటా, టాక్‌టైంతోపాటు మరెన్నో ప్రయోజనాలను ఎయిర్‌టెల్ ప్యాక్, ప్లాన్‌లపై పొందవచ్చు. ఎయిర్‌టెల్‌కు చెందిన అన్ని రకాలైన కమ్యూనికేషన్ల వేదిక ద్వారా “డియర్ కామ్రెడ్” ప్రచారం సాగించడం, ఆసక్తికరమైన పోటీలు నిర్వహించడంతో పాటుగా విజేతలకు ప్రత్యేకమైన మీట్ ఆండ్ గ్రీట్ అవకాశం, సినిమా టికెట్లు పొందడం సహా మరెన్నో ఆకర్షణీయమైన ప్రయోజనాలు కల్పించనుంది.
ఈ సందర్భంగా భారతీ ఎయిర్‌టెల్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఈఓ అవ్‌నీత్ సింగ్ పూరి మాట్లాడుతూ “డియర్ కామ్రెడ్ సినిమాతో మేం ఒప్పందం కుదుర్చుకోవడం మాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ప్రాంతీయ భాషల కంటెంట్ స్పష్టమైన సమాచార మార్పిడికి ఉపయోగపడుతుందని రాబోయే ఈ తరహా సమాచార మార్పిడి మరింత పెరుగుతుందని ఎయిర్‌టెల్ భావిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన మార్కెట్‌లలో సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో మాకు ఉన్న స్పష్టమైన అవగాహనతో ఈ విశ్లేషణ చేస్తున్నాం. తెలుగు సినీ పరిశ్రమలో స్వల్పకాలంలో అన్ని వర్గాల ఆదరణ పొందిన సుప్రసిద్ధ హీరో విజయ్ దేవరకొండ ఈ ఒప్పందం ద్వారా ఎయిర్‌టెల్ యొక్క అన్ని ప్లాట్‌ఫాంల ద్వారా మరింత చేరువ చేయడం మాకెంతో సంతోషాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని మా వినియోగదారులకు చెందిన సినిమా, ఎంటర్‌టైన్మెంట్ ఆకాంక్షలు నెరవేర్చడంలో మరో కీలకమైన ముందడుగు వేయడంతో పాటుగా ఈ రంగంలో మా ప్రయత్నాలు మరింత సఫలంగా సాగేందుకు ఈ ఒప్పందం సహకరిస్తుందని మేం విశ్వసిస్తున్నాం” అని ఆశాభావం వ్యక్తం చేశారు.
కొందరు హీరో హీరోయిన్లు సిగ్గులేకుండా… : కంగనా రనౌత్