telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“రాములో రాములా” సాంగ్‌కి దోశ స్టెప్ వేశావు : అల్లు అర్జున్ కూతురు

Arha

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘అల వైకుంఠపురములో…’ వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్‌లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోందని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. కానీ సినిమా విడుదల తేదీ మారుబోతుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో “రాములో రాములా” సాంగ్‌కి హాఫ్ కోట్ వేసుకొని స్టెప్స్ వేశారు బ‌న్నీ. ఈ స్టెప్ బ‌న్నీ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అయితే దీనిని దోశ స్టెప్ అని తేల్చేసింది బ‌న్నీ ముద్దుల కూతురు అర్హా. దోస వేసిన‌ట్టు ఇలా మొత్తం తిప్పుతావు అంటూ ముద్దు ముద్దు ప‌లుకులు ప‌లికింది అర్హా. అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి నెటిజ‌న్స్‌కి మంచి మ‌జా అందించింది. మీరు ఈ వీడియోను వీక్షించండి.

 

View this post on Instagram

 

Dosa step 😂#alavaikunthapurramuloo @alluarjunonline

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) on

Related posts