telugu navyamedia
వార్తలు సామాజిక

దేశంలో క‌రోనా మహోగ్రరూపం.. కొత్తగా 75,809 మందికి పాజిటివ్

Corona

దేశంలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 75,809 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన బులెటిన్‌లో పేర్కొంది. అదే సమయంలో 1,133 మంది మృతి చెందారు.

దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 42,80,423కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 72,775కు పెరిగింది.  ఇప్పటివరకు 33,23,951 మంది కోలుకున్నారు. 8,83,697 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో నిన్నటి వరకు మొత్తం 5,06,50,128 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ ఐసీఎంఆర్ తెలిపింది.

Related posts