telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

క‌తువా రేప్ కేసులో ముగ్గురికి జీవిత ఖైదు..మరో ముగ్గురికి ఐదేళ్ల జైలు

SIT Investigation YS viveka Murder

జ‌మ్మూక‌శ్మీర్‌లోని క‌తువాలో గ‌త ఏడాది జనవరిలో 8 ఏళ్ల బాలిక‌ను కిడ్నాప్ చేసి మత్తు మందిచ్చి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి కోర్టు సోమవారం నాడు ఆరుగురిని దోషులుగా తేల్చింది. సోమవారం మధ్యాహ్నం దోషులకు శిక్షలను ఖరారు చేసింది. ఈ కేసులో మొత్తం ఏడు విచార‌ణ ఎదుర్కొన్నారు. అత్యాచార కేసులో ప్ర‌ధాన నిందితుడు పూజారి సంజీ రామ్‌ను దోషిగా తేల్చారు. ఆయ‌న కుమారుడు విశాల్‌ను మాత్రం నిర్దోషిగా ప్ర‌క‌టించారు.

పూజారి సంజీ రామ్‌ తో పాటు మరో ఇద్దరు దోషులు పర్వేశ్ కుమార్, దీపక్ ఖజారియాలకు జీవిత ఖైదు శిక్షతో పాటు రూ. లక్ష చొప్పున జరిమానా ఖరారు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. సాక్ష్యాలు చెరిపేసినందుకు తిలక్ రాజ్, ఆనంద్ దత్, సురేందర్‌కుమార్‌లను ముగ్గురిని దోషులుగా తేల్చిన కోర్టు వారికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసుకు సంబంధించి విచార‌ణ‌ను జూన్ 3వ తేదీన ముగించారు. తీర్పు సంద‌ర్భంగా ఇవాళ కోర్టు వ‌ద్ద భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. 

Related posts