telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

ప్రపంచ వాణిజ్యం మూడోవంతు పడిపోతుంది: డబ్ల్యూటీవో

WTO

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) పలు కీలక విషయాలను వెల్లడించింది. ఆ సంస్థ చీఫ్ రాబెర్టో అజెవెడో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య రంగం ఈ ఏడాది 13 నుంచి 32 శాతం మధ్య నష్టపోయే అవకాశం ఉంటుందని తెలిపారు.

 వాణిజ్య రంగం ఇంతగా క్షీణించిపోతుండడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2021లో దేశాల ఆర్థిక వ్యవస్థ కాస్త నిలదొక్కుకుంటాయని, అయితే ఈ క్షీణత మాత్రం 21 శాతం నుంచి 24 శాతం మధ్య ఉంటుందని తెలిపింది.2008తో పాటు 1930లో తలెత్తిన పరిస్థితులతో పోల్చితే అంతకంటే ఎక్కువగానే ఈ సారి ఆర్థిక సంక్షోభం ఉంటుంది’ అని రాబెర్టో అజెవెడో తెలిపారు.

ప్రపంచ వాణిజ్యం మూడోవంతు పడిపోతుందని చెప్పారు.ప్రపంచం  గతంలో ఎన్నడూ చూడనంతగా ఆర్థిక సంక్షోభం తలెత్తుతుందన్నారు. కరోనా వల్ల తతెత్తుతున్న ఆరోగ్య సంక్షోభంతో ప్రపంచ దేశాల ప్రభుత్వాలు ఎన్నో విధాలుగా చర్యలు తీసుకుంటున్నాయని గుర్తు చేశారు.

Related posts