telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

చైతన్య ‘లవ్ స్టోరీ’ విడుదల వాయిదా

అక్కినేని హీరో నాగచైతన్య, నాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా ఓ అందమైన ప్రేమకథగా రూపొందింది. ఈ చిత్రాన్ని సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ మరియు అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నారాయణ దాస్ కె.నారంగ్ పుష్కర్ రామ్మోహన్ రావ్ నిర్మాతలుగా ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పాట ప్రోమోలు, ప్రచార చిత్రాలు ప్రేక్షకులను అనుకున్న స్థాయికంటే ఎక్కువగానే ఆకర్షించాయి. అయితే ఈ సినిమా ఏప్రిల్ 16న థియేటర్లోకి రానున్నట్లు ఇంతక ముందు ప్రకటించింది చిత్రబృందం. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీ చేనునట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో… ”లవ్ స్టోరీ’ చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నట్టుగా నిర్మాతల్లో ఒకరైన సునీల్ నారంగ్ తెలిపారు. ఈ పేండమిక్ సిట్యూయేషన్ తొలగిపోయిన తర్వాత తమ సినిమాను విడుదల చేస్తామని తెలిపారు. మరో ఈ సినిమా విడుదల విషయంలో మళ్ళీ ఎప్పటికి క్లారిటీ వస్తుందో మరి!?

Related posts