telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దర్శకుడి సంచలన ట్వీట్… ఆ సీఈఓ రేప్ చేశాడు…!?

Pakisthan

పాకిస్థాన్‌కు చెందిన జంషెద్ మెహమూద్ అనే దర్శకుడు తనపై ఓ ప్రముఖ వార్తా పత్రికకు చెందిన సీఈఓ అత్యాచారం చేశాడని చెప్పి సంచలనం క్రియేట్ చేశారు. ప్రముఖ పాకిస్థానీ వార్తా పత్రిక అయిన డాన్ సీఈఓ హమీద్ హరూన్. అయితే తనపై ఓ ప్రముఖ సీఈఓ అత్యాచారానికి పాల్పడ్డాడని రెండు నెలల క్రితమే జంషెద్ ఆరోపించారు. అయితే అతని పేరు బయటపెట్టడానికి భయపడ్డాడు. కానీ ఇప్పుడు అతని పేరును ధైర్యంగా బయటపెడుతున్నానంటూ ట్విటర్‌లో మండిపడ్డారు. “అవును డాన్ పత్రిక సీఈఓ హమీద్ హరూన్ నన్ను రేప్ చేశాడు. ధైర్యం ఉంటే ఈ వార్తను మీ పత్రికలో ప్రచురించండి. నేను మీటూ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను. ఎందుకంటే గదుల్లో, న్యాయస్థానాల్లో ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. ఎందుకంటే మీడియాలోనే పవర్‌ఫుల్ వ్యక్తి అయిన ఒకరు నన్ను దారుణంగా రేప్ చేశాడు. ఈ విషయం గురించి నేను నా స్నేహితులకు చెబితే అందరూ జోక్‌గా తీసుకున్నారు. ఈ ఘటన జరిగి 13 ఏళ్లు అవుతోంది. అప్పుడే ఎందుకు చెప్పలేదని నన్ను నేను శపించుకుంటున్నాను. కానీ ఆ దారుణ ఘటనను మర్చిపోవడానికి నేను థెరపిస్ట్ వద్దకు వెళ్లా్ల్సి వచ్చింది. కొన్ని నెలల పాటు పాకిస్థాన్‌కు దూరంగా ఉన్నాను. ఆ నీచుడు మా నాన్న చనిపోయినప్పుడు పరామర్శించడానికి కూడా వచ్చాడు. నా జీవితం నాశనం చేశాడని మా నాన్నకు కూడా తెలుసు” అని పేర్కొన్నాడు.

Related posts