2001లో ‘”ఇష్టం” సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రియ శరణ్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా హవా కొనసాగించింది. 18 ఏళ్లుగా సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ బ్యూటీ 2018లో ఆండ్రీ కొశ్చెవ్‌ని రాజస్థాన్‌లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్ళి తర్వాత సినిమాలని పూర్తిగా తగ్గించేసింది. చివరిగా “గౌతమీపుత్ర శాతకర్ణి” చిత్రంతో పలకరించిన ఈ అమ్మడు ఇప్పుడు పలు తమిళ సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం హిందీలో “తడ్కా” , తమిళంలో “నరగాసురన్”, “సండకారి” సినిమాలలో నటిస్తోంది. అయితే శ్రియ సోషల్ మీడియాను శ్రియా బాగానే ఉపయోగించుకుంటుంది. గ్లామర్ ఫొటోలను, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ కుర్రకారును, అభిమానులను ఆకట్టుకుంటోంది. 36 ఏళ్ళ వయస్సులోను శ్రియ యూత్‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ శ్రియా శరన్. రష్యన్ మ్యూజిషియన్ అండ్రూతో పెళ్లి తర్వాత సినిమాల్లో ఈ అమ్మడుకి సినిమా అవకాశాలు తగ్గిన మాట వాస్తవమే. సినిమాల్లో అవకాశాలు లేకపోతేనేం సోషల్ మీడియా పుణ్యమాని అందరికీ దగ్గరగానే ఉంటుంది. తన హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో యువతకు కిర్రెక్కిస్తుందీ అమ్మడు. రీసెంట్‌గా తిరువనంతపురంలోని ఇన్ఫినిటీ హోటల్లోని స్మిమ్మింగ్ పూల్‌లో బ్లాక్ బికినీతో శ్రియా శరన్ ఎంజాయ్ చేస్తున్న వీడియోను శ్రియా తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసి అభిమానుల్లో సెగలు పుట్టిస్తుంది. ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 3.27 లక్షలు వ్యూస్ వచ్చాయి. ఈ అమ్మడు త్వరలోనే `అసురన్` తెలుగు రీమేక్‌లో వెంకటేశ్‌తో కలిసి నటిస్తుందని వార్తలు వస్తున్నాయి.
ఆ సీన్ టీడీపీ వాళ్ళకే ఎక్కువ నచ్చింది… చాలా సంతోషిస్తున్నారు : ఆర్జీవీ