telugu navyamedia
సినిమా వార్తలు

హీరోతో ఎఫైర్… స్పందించిన ప్రియా వారియర్

Priya Prakash Varrier images

వింక్ గర్ల్ ప్రియా ప్రకాష్ ఒక్క వీడియోతో ఇంటర్నెట్ లో సెన్సేషన్ గా మారిపోయింది. ఆమె నటించిన తొలి చిత్రం “ఒరు అడార్ లవ్” సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ప్రస్తుతం సినిమాలు, యాడ్స్ అంటూ బిజీ హీరోయిన్ గా గడుపుతోంది. అయితే “ఒరు అడార్ లవ్” సినిమా సమయంలో ప్రియా తన కో స్టార్ రోషన్ తో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఇటీవల రోషన్ పుట్టినరోజు సందర్భంగా ప్రియా ప్రకాష్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తన కోసం రోషన్ ఎంతో చేశాడని, అతడిపై మాటల్లో చెప్పలేనంత అభిమానం ఉందని ప్రియా పోస్ట్ లో రాసుకొచ్చింది. అది చూసిన వారంతా కూడా ప్రియా, రోషన్ లు ప్రేమించుకుంటున్నారని కన్ఫర్మ్ చేసేసుకున్నారు. తాజాగా ఈ విషయంపై ప్రియా స్పందించింది.

రోషన్ తో ప్రేమలో ఉన్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని, రోషన్ కి తనకు మధ్య మంచి రాపో ఉందనే విషయం నిజమే కానీ అందరూ అనుకున్నట్లుగా కాదని, ఇద్దరం కలిసి ఒకే సినిమాతో పరిచయం కావడం, సేమ్ ఏజ్ గ్రూప్ కావడం వల్ల క్లోజ్ అయ్యామని అంతకుమించి తమ మధ్య ఏం లేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు రూమర్స్ అనేవి వస్తూనే ఉంటాయని, నిజాలు తెలిసినప్పుడు వాటికి విలువ ఉందని చెప్పింది. తన వృత్తిలో రూమర్స్ అనేవి కామన్ అని, తన పని తాను నిజాయితీగా చేసుకుంటూ మిగిలినది ప్రజలకే వదిలేస్తానని చెప్పి తన పరిణతిని చూపించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో నటించిన మొదటి చిత్రం “శ్రీదేవి బంగ్లా” విడుదలకు సిద్ధంగా ఉంది.

Related posts