telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలు మరణం తీరని దుఃఖ సముద్రంలో ముంచేసింది : గాయని పీ సుశీల

SPB

సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇకలేరనే విషయాన్ని సినీ లోకం, ప్రేక్షకులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రముఖులంతా సంతాపాలు తెలియజేస్తున్నారు. బాల సుబ్రహ్మణ్యం మరణంపై గాయని పీ సుశీల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సంగీత ప్రపంచానికి ఎంతో మేలు చేసిన బాలుని మహమ్మారికి వెంటాడి వెంటాడి వేధించి తీసుకుపోయిందని భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేసారు. “కరోనా ఇంత అలజడి రేపుతుందని అనుకోలేదు. మనందరి ఆప్తుడిని తీసుకుపోయి ఒక పెద్ద అగాధంలోకి తోసేసింది. వెంటాడి వెంటాడి మనందరికీ కావాల్సిన బాలును ఆ మహమ్మారి తీసుకుపోయింది. బాలు లేడన్న విషయం తెలియాగానే ఒళ్ళు గగుర్లుపొడిచింది. ఘంటసాలగారినే మెప్పించాడు బాలు. ఆయన లేడన్న విషయం మరచిపోవడం చాలా కష్టం. బాలు మరణం ప్రపచవ్యాప్తంగా అభిమానులందర్నీ తీరని దుఃఖ సముద్రంలో ముంచేసింది” అంటూ ఆమె కంటతడిపెట్టారు. ఇక 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో 17 భాషల్లో 40వేలకు పైగా పాడి భారత సినీ పరిశ్రమపై చెరగని ముద్ర వేశారు ఎస్పీ బాలు. అత్యధిక పాటలు పాడిన ఏకైక గాయకుడిగా రికార్డుకు కూడా ఎక్కారు.

Related posts