telugu navyamedia
సినిమా వార్తలు

సోదరి ప్రేమ వ్యవహారంపై స్పందించిన హృతిక్

Hrithik-Roshan-and-his-sister

స్టార్ హీరో హృతిక్ రోషన్ సోదరి సునయన రోషన్ తాను ముస్లిం వ్యక్తిని ప్రేమించాననే కారణంతో తన కుటుంబ సభ్యులే వేధింపులకు గురిచేస్తున్నారని సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. సొంత తమ్ముడు హృతిక్ కూడా తనకు సాయపడడం లేదని, కుటుంబం మొత్తం తనను వేధిస్తున్నారని, నరకం అంటే ఏంటో చూపిస్తున్నారని కామెంట్స్ చేసింది సునయన. సోదరి ప్రేమ వ్యవహారంపై హృతిక్ రోషన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా వ్యాఖ్యానించారు. “మా కుటుంబ సభ్యుల మధ్య అందమైన అనుబంధం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి, స్నేహితుల వరకు మనం ప్రేమని చాలా మందికి పంచుతాం. కాకపోతే కాస్త ఆలోచించగలిగే శక్తి కూడా ఉండాలి. మనపై ప్రేమ చూపించే వారిలో ఎవరిది నిజమైన ప్రేమో తెలుసుకోగలగాలి. ప్రేమించే వ్యక్తిపై ఎప్పటికి ద్వేషం రాదు. అలా వస్తే అసలు అది ప్రేమే కాదు” అంటూ తన సోదరి ప్రేమ వ్యవహారం గురించి స్పందించారు హృతిక్.

Related posts