telugu navyamedia
సినిమా వార్తలు

కంటతడి పెట్టిన బోనీ కపూర్… కారణం శ్రీదేవి

Boney-Kapoor-Gets-Emotional

నటి శ్రీదేవి కాలంచేసి ఏడాదికి పైగానే గడిచింది. శ్రీదేవికి సంబంధించిన ఏ ప్రశ్న అడిగినా ఆమె భర్త బోనీకపూర్ భావోద్వేగానికి గురవుతున్నారు. ఇటీవల బోనీ‌కపూర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన జీవితంలో ఎదురైన పలు అనుభవాలతోపాటు శ్రీదేవికి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా “మీకు శ్రీదేవి గుర్తుకురాని క్షణాలేవైనా ఉన్నాయా?” అనే ప్రశ్న ఎదురవ్వగా, వెంటనే బోనీ కంటతడి పెట్టుకుని, అటువంటి సందర్భాలు లేవని తెలిపారు. శ్రీదేవి 2018 ఫిబ్రవరిలో దుబాయ్‌లోని ఒక హోటల్‌లో ప్రమాదవశాత్తూ మృతి చెందారు. ఇప్పటికీ ఆమె సన్నిహితులు, అభిమానులు ఆమెను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.

Related posts